ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Monday, 6 June 2011

బాపు బొమ్మల కొలువు-తిలకించిన మది పులకించె...






మే నెలాఖరులో మిత్రుడు మలపాక పూర్ణచంద్ర రావు వాళ్ళ అబ్బాయి పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి వచ్చినప్పుడు మొదటగా చేప్పాడు జూన్ 4,5,6 తేదీలలో హైదరాబాద్ లో బాపు బొమ్మల కొలువు జరగబోతోందని.


ఆ తరువాత ఈమెయిల్ లో కార్టూనిస్ట్,చిత్రకారుడు అన్వర్,అలాగే ప్రముఖ రచయిత,చిత్రకారుడు బ్నిం ,ఫేస్ బుక్ లో శ్రీ పుక్కల రామకృష్ణ పంపిన ఇన్విటేషన్ లు చూసాను.


మూడో తేదీ నా శ్రీమతి ఉషారాణి అంధ్రబాలానంద సంఘం సమ్మర్ కాంప్ ముగింపోత్సవ సభకు ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు తన చేత మలపాక ఇన్విటేషన్ కూడా పంపించాడు.





హైదరాబాద్ మాదాపూర్ లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లో ఉదయం ప్రారంభోత్సవం అనేసరికి మలకపేట నుండి అంత దూరం ఎలా వెళ్ళాలా అని అనుకున్నాను.


ఇంతలో మన ప్రముఖ కార్టూనిస్ట్ మిత్రుడు ' సరసి 'ఫోన్ చేసి నాల్గవ తారీఖు పొద్దున్న 8.30 కే బాపు గారు ప్రత్యేకంగా కార్టూనిస్టులను సరదాగా కలవడానికి ఒప్పుకున్నారని తప్పక రమ్మనమనీ అభిమానంగా చెప్పాడు.


నేను మిత్రుడు కార్టూనిస్ట్ శ్రీ .ఎం.ఎస్.రామకృష్ణకు ఫోన్ చేసి తను ఎలా వెడుతున్నాడని అడిగాను.తను మా వైపే కొత్తపేట లో వుంటాడు.కార్టూనిస్ట్ శ్రీ బాచి,కామేష్ కలసి వెడదామన్నారని చెప్పాడు.బాచి కారులో నాకూ చోటు వుంటుందా అంటే తనే కనుక్కుని అంతకన్నానా తప్పక రమ్మనమని అన్నారు.


అలా ఫ్రోగ్రాం ఫిక్స్ చేసుకుని 4వ తేదీ ఉదయం 7 గంటలకల్లా రామకృష్ణ ఫోన్ చేయగానే దిల్ సుఖ్ నగర్ టి.వి.టవర్ దగ్గర నన్ను కారు ఎక్కించుకున్నారు. అంతా బాచి డ్రైవింగ్ లో కులాసా కబుర్లతో కొంచెం వెతుక్కున్నా మొత్తానికి సమావేశ స్థలం చేరుకున్నాం. అప్పటికే మిత్రులంతా రాసాగారు.


బ్నిం మొదట్లోనే ఆప్యాయంగా పలకరించారు.

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ ఎం.ఎస్.రామకృష్ణ, బ్నిం లతో నేను

వాళ్ళ గురువుగారితో బాటు సరసి చేరుకున్నాడు.

ప్రముఖ కార్టూనిస్ట్ సరసి,వారి గురువుగార్లతో


మోహన్,చంద్ర,శేఖర్,శంకర్,అన్వర్,శంకు,గోపి,సాయికృష్ణ,గీతా సుబ్బారావు,రవి,వడ్డేఓంప్రకాష్,గూడూరి,తల్లావజ్ఝల శివాజీ, రమణజీవి,నాకు ముఖతః పరిచయం లేని ఎందరెందరో ఒక్కొక్కరే చేరసాగారు.


ఇంతలో తనికెళ్ళ భరణి వచ్చారు.




ఆర్ట్ గ్యాలరీ ప్రవేశ ద్వారం దగ్గర నుండీ ఎంతో శోభాయమానంగా బాపు బొమ్మలతో అద్భుతంగా అలంకరింపబడింది.



ఆర్ట్ గ్యాలరీ పక్కన గల హాల్ లో సమావేశం.


ఇంతలో మన 'బాపు ' గారు రానే వచ్చారు.

అంతా సందడేసందడి.


బాపు బొమ్మల కొలువు సందర్భంగా ప్రచురించిన ప్రత్యేకసంచిక కార్టూనిస్టులు అందరకూ 250 రూపాయలకే ఇచ్చేస్తున్నట్లు ముఖీ మీడియా శ్రీ శివలెంక పావని ప్రసాద్ తరుఫున బ్నిం ప్రకటించేసాడు.




అంతా ఆసక్తిగా సంచికలు కొని వాటి మీద బాపు సంతకం చేయించుకోవడానికి బారులు తీరారు.


నేను కూడా కొన్న పుస్తకం మీద ఆయన సంతకం చేయమని పుస్తకం ముందు పెట్టి నాపేరు రాయమనికోరగా ఆయన సుధామకు అని రాసి సంతకం చేసారు.




జీవితంలో మొదటిసారి నా పేరు బాపు గారి వ్రాతలో చూసుకు మురిసిపోయా.

తరువాత పరిచయ కార్యక్రమం అప్పుడుకూడా ఆ సంగతే చేప్పా.ఎప్పటికైనా ఒక పుస్తకానికి ఆయన బొమ్మ వేయించుకోవాలన్న కొరికను ప్రకటించా.బాపు గారు ఓపికగా చిరునవ్వుతో అందరికీ ఆ పూట గంటలకొలదీ అలా సంతకాలు చేస్తూనే వున్నారు.కాస్త సంతకాల హడావుడి ఆపించి తనికెళ్ళ భరణి శ్రీ వంశీ గారు కూడా రావడంతో కార్టూనిస్టుల సమావేశ సభ మొదలు పెట్టించారు.




ఇష్టాగోష్టిగా సాగిన ఆ సభలో అందరూ బాపు గారికి తమను తాము పరిచయం చేసుకున్నారు.


స్వాతి బలరాం గారు ఇమ్మన్న లక్ష రూపాయల పర్స్ ను భరణి డబ్బు చూపించి మరీ హర్షధ్వానాల మధ్య బాపుకు అందచేసారు.


నిరంతర సాధన చేయాలని,రాజకీయ కార్టూన్లు వేయడం మీద ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని బాపు గారు చేప్పారు.


ఫొటోలతో,పలకరింపులతో,బాపుగారి ఆటోగ్రాఫ్ లతోఅంతాకోలాహలo





కార్టూనిస్టుల గ్రూప్ ఫోటో


టీ,బిస్కట్లువచ్చాయి.అంతాతీసుకున్నారు.




అసలుప్రారంభోత్సవ సభకు వేళ అవుతోందని ఇంక అంతా ఆర్ట్ గ్యాలరీ వైపు తరలారు.


ప్రముఖ నటులు.పద్మవిభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు,నటులు బాలకృష్ణ,శ్రీ వర ప్రసాద రెడ్డి రాగానే బాపు బొమ్మల కొలువు ఉదయం 11 కు ప్రారంభోత్సవం జరిగింది.

బాపు,అక్కినేనిల సరసన నేను.రామకృష్ణ.


మీడియా అంతా తరలి వచ్చింది కూడాను.






ఎన్నెన్ని బొమ్మలో .


అన్నీ బాపు గారి ఒరిజినల్స్.





ఎంతసేపు చూసినా తనివి తీరదు.


మూడు రోజులు కాదు పది రోజులైనా


వాటి అందాలనూ, అర్థాలనూ చూస్తూ,విశ్లేషించుకుంటూ, ఆనందిస్తూ గడిపివేయవచ్చు.




అనంతరం సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సంస్థ పక్షాన శ్రీ కాంతారావు గారు,ఆర్.వి.రమణ మూర్తి గారు అక్కినేని చేతుల మీదుగా బాపు గారికి 'రేఖా కళా చక్రవర్తీ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.


అందరూ బాపు గారి గురించి మాట్లాడాక కార్యక్రమ వ్యాఖ్యాత అంబటిపూడి మురళీకృష్ణ ఇప్పుడు బాపు గారు మాట్లాడతారని కన్విన్సింగ్ గా ప్రకటించినా ఆయన ఎప్పటి లాగానే 'అందరికీ నమస్కారం' అని మాత్రమే అనేసి కూర్చున్నారు.






ముఖీ మీడియా ప్రసాద్ ఉద్విగ్నంగా వందన సమర్పణ చేసారు.


నిజంగా ప్రదర్సన ఆద్యంతం అద్భుతం.
మాటలతో వర్ణించదం కష్టం.
ఎవరికి వారు చూసి రసానందం పొందవలసిందే.
వదలలేక వదలలేక ఇంక మధ్యాహ్నం దాటిపోవడంతో ఇంటికి తిరిగి బయలు దేరాము.


రామకృష్ణ అబీడ్స్ లో మా బ్యాచ్ మిత్రులు అందరికీ కూల్ డ్రింకులు ఇప్పించాడు.



నేను మలకపేట దగ్గర దిగి ఇంటికి వచ్చాను.

ఇంతలో భక్తి టి.వి,వనిత టి.వి.  శ్రీ. రఘు ఏలూరి గారిఫోను.


తాను ప్రదర్శనకు రాలేకపోయాననీ కానీ ప్రత్యేక సంచిక అందిందనీ, అందులొ బాపు గారి పై నేను రాసిన వ్యాసం చాలా బాగుందని చెప్పడానికి ఫోన్ చేస్తున్నానని చెప్పారు.



అంత వరకూ సంచిక మొత్తం నేను చూడనే లేదు.


అపుడు తిరగవేస్తే నాకే ఆశ్చర్యమూ,ఆనందమూ కలిగిస్తూ 120 వ పేజీ లో 'చిరంజీవి బాపు ' అని ఎప్పుడో నేను రాసిన వ్యాసం కనబడింది.


నా ఆనందానికి అవధులు లేవు.


నా వ్యాసం వున్న పేజీలలో బాపు గారి బొమ్మలు కూడాను


బాపు గారిపై సంచికలో నా వ్యాసం.

నందం మీ అందరితొ పంచుకోవడానికే ఈ రాత.

మీ ఆదరాభిమానాలు సదా కోరుకుంటూ వుంటాను.


సదా మీ
సుధామ



6 comments:

  1. anukokundaa ee vyaasaanni-photolanu-bommalanu- choosi -aanandamtho- baadhatho vraasthunnaanu. aanandam yendukante- sabhaa vivaraalanu kallaku kattinatlu maa mundu pradarshinchi nanduku-sudhama garu- ayithe vishaadaaniki kaaranam- vyaasam chivarna mana ramana gari rekhaachitram choosi- -gunde talupulu tattina bapu gaari naalugu maatalu vini-voleti venkata subba rao,vernon hills IL/USA

    ReplyDelete
  2. అనివార్యకారణాలవల్ల రాలేకపోయానే అని బాధపడుతున్న నాకు
    అక్కడి విశేషాలు కళ్ళకు కట్టినట్లు చూపించిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  3. బాపు గారి బొమ్మల కొలువు తోపాటు ఆయననీ చూసి, మీపేరు స్వయంగా బాపు గారు రాసిన ఆయన ఆటోగ్రాఫ్ కూడా పొందటం చాలా అదృష్టం అండీ! రాలేననత దూరంలో ఉండిపోయి మిస్ అయిపోయాను. ఊండుంటే కన్నుల పండువగా కొలువు తీరిన ఆ బొమ్మలని చూసి తరించిపోయేవాడిని...
    చాలా విపులంగా రాశారు, థ్యాంక్స్ అండీ! ఇండియా లో లేని వాళ్ళు ఆ ప్రత్యేక సంచిక కావాలంటే ఎలా కాంటాక్ట్ చెయ్యాలో చెప్పగలరా? ఆ పుస్తకంపై email లాంటిది ఏదైనా ఉంటే చెప్పండి.

    ReplyDelete
  4. విశేషాలు వివరించినందుకు సుధామ గారికి ధన్యవాదములు.
    వెళ్ళలేకపోయినందుకు ఏంతొ చి౦తిస్తున్నాను.

    ~ పుక్కల్ల రామకృష్ణ

    ReplyDelete
  5. అదృష్టవంతులు.. విశేషాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు..

    ReplyDelete
  6. బాపు బొమ్మల కొలువు...
    endaro mahanubhaavulu
    andarilo
    andarito...
    నా ఆనందానికి అవధులు లేవు.

    ReplyDelete