ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Sunday, 24 April 2011

ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం






సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం సంగతి



25 ఏప్రెల్ 1971 నాడే మా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి రచయితల సంఘం ప్రథమ వార్షికోత్సవ సంచిక 'జ్యోత్స్న ' ప్రచురణ జరిగింది. అట్టమీద బొమ్మ ఆర్టిస్ట్ చంద్ర ది కాగా, జ్యోత్స్న అన్న అక్షరాలంకరణ నాదే.

7 ఏప్రెల్ 1970 లో శ్రీ.తాపీ ధర్మారావుగారి అద్యక్షతన శ్రీ దివాకర్ల వేంకటావధాని గారిచే ఉస్మానియా విశ్వవిద్యార్థి రచయితల సంఘం స్థాపన జరిగింది.

దివాకర్ల వేంకటావధాని



వెంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన ఓలేటి పార్వతీశం గారి కుమారులు (ప్రస్తుతం దూరదర్శన్ లో పనిచేస్తున్న ఓలేటి పార్వతీశం గారి నాన్న గారు) శ్రీ.శశాంక గారు(ఓలేటి సుబ్బారావు అసలు పేరు) మా సంఘం అధ్యక్షులు.ప్రతి నెలా సమావేశాలు జరిగేవి.అంతర్ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులంతా పాల్గొనేవారు.ఆ సంఘానికి నేను అప్పుడు సహాయ కార్యదర్శిని.





శ్రీ.శశాంక గారు



1971 లో న్యూ సైన్స్ కళాశాలలో జరిగిన కవిసమ్మేళనం లో పోటీ పెట్టగా నా కవిత 'నీడలు ' ప్రథమ బహుమతి గెలుచుకుంది.



ఆ కవిత ఈ వార్షిక సంచికలో ప్రచురితమవడానికి ముందే అప్పట్లో శ్రీ.కె.శివారెడ్డి సంపాదకుని గా వచ్చే 'వేకువ ' త్రై మాస పత్రికలోనూ అచ్చయింది.అంతటా మంచి ప్రశంసలు పొందింది.40 ఏళ్ళ క్రితం ఆ కవితను మీ ముందు పెడుతూ ఇప్పుడు తలుచుకుంటున్నాను.



1 comment: