Friday, 8 July 2011
'మరో జంఘాల శాస్త్రి '
సాక్షి వ్యాసాలద్వారా పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు జంఘాలశాస్త్రి పాత్రను చిరస్మరణీయం చేసారు.
జంఘాలశాస్త్రి పాత్రతో -నేను ఆధునికంగా మలచి 1977 ప్రాంతంలో రాసిన నాలుగైదు వ్యాసాలు అప్పట్లో 'చుక్కాని ' వార పత్రికలో వచ్చాయి.
కానీ మా యువభారతి కార్యదర్శి శ్రీ అయల సోమయాజుల నాగేశ్వరరావు గారు 'మరో జంఘాల శాస్త్రి 'పేరున అనేక వ్యాసాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నారు.
మొదట్లో రెండు సంపుటాలుగా వెలువరించిన ఆ గ్రంధాన్ని మరిన్ని వ్యాసాలతో పరిపుష్టం చేసి 2009 లో ఒక గ్రంథం గా ప్రచురించారు.
ఆ పుస్తకానికి ముందుమాట నాచేత రాయించడం ఆయన అభిమానం.
అంతేకాదు ముఖచిత్రంకూడా నేను మొదటి సంపుటాలకు వేసిందే.
దాన్నిగురించి...
నేను రాసిన ముందుమాట ఇది.
'మరో జంఘాల శాస్త్రి 'రచయిత శ్రీ అయల సోమయాజుల నాగేశ్వరరావు
Subscribe to:
Post Comments (Atom)
సుధామ గారు, నమస్తె !
ReplyDelete'జంఘాల శాస్త్రి పునరుత్థానం'అంటూ వ్రాసిన మీ వ్యాసం ఇదివరకు చదివాను.ఇప్పుడు మళ్ళీ చదివాను.చాలా బాగుంది.ఆ మధ్య
శ్రీ నాగేశ్వర రావు గారు రాజమండ్రి వచ్చారు.. వారి మూడవ వాల్యూం జంఘాల శాస్త్రి సహృదయంతో ఇచ్చారు.అప్పుడే సుధామ బాగా వ్రాసారనుకున్నా. బ్లాగు, మెయిలు సదుపాయం లేక...ఉత్తరం వ్రాసినా చిరునామా కూడా వ్రాయాలి కదా.అది లేదు కనుక నా అభిప్రాయం నాలోనే ఉండిపోయింది.. చాలా బాగుంది.
మీ సామాజికోపనిషత్తు (సంపాదకీయం) ఉపనిషత్ సుధా లహరిలో చాలా బాగుంది. దీని గురించి మీకు వేరే మెయిల్ చేస్తాను..అభినందనలతో ....దినవహి