ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Saturday, 21 May 2011

నేను రాసిన మొదటి పీఠిక :1979




ఆచార్య తిరుమల
ప్రముఖ కవి,పండితుడు.

మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు  గారి భార్య సత్తెమ్మ నరసింహారావు గారి పేరు మీద వుండిన కాలేజి లో లెక్చరర్ గా పని చేసేవారు.

కానీ అర్థంతరంగా ఆ కాలేజీ ఎత్తివేయడంతో అందులోని కొంతమంది కలసి చైతన్య కళాశాలను స్థాపించారు.

స్థాపక ప్రముఖులలో తానొకడు.

చివరివరకూ తెలుగు శాఖను తానే నిర్వహించాడు.

ఎందరినో సాహితీవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత తనది.

అటు పద్యాన్ని,ఇటు వచన కవితనూ,వ్యాసాన్నీ,ఉపన్యాసాన్నీ కూడా సమర్థవంతం గా నిర్వహించిన ఆచార్య తిరుమల ప్రచురించిన తొలి వచన కవితా సంకలనం 'మాట్లాడే మల్లెలు '.




నా మీద గల అమిత మిత్ర వాత్సల్యంతో దానికి నాచేత ముందు మాట రాయించడం మరపురాని విషయం.

తన మున్నుడిలో కూడా నన్ను తలుచు కున్నాడు.

 మా స్నేహం అనేక సంవత్సరాలు సాగింది.

ఆకాశవాణి లో నేను కార్యక్రమ నిర్వహణాధికారిగా వుండగా ఆనేక కార్యక్రమాలు తాను చేశాడు కూడా.

రిటైర్ కాకుండానే తన మరణం మేము ఎవ్వరమూ జీర్ణించుకోలేక పోయాము.


మాట్లాడే మల్లెలకు ఆ నాటి తన మున్నుడి.



నా ముందు మాట ఇది.







1 comment:

  1. నమస్కారం మాస్టారు. మీరు ఇలాగ గొప్ప సాహిత్యకారులను, వారితో మీ అనుబంధాన్ని, ఇంకా ఆసక్తికరమైన పాత విషయాల్ని ఇలా మాకిందించడం చాలా బావుంది. నెనర్లు.

    ReplyDelete