సాహిత్యాభిమానులకు ఉపయుక్తమయ్యే డైరీ ఒకదానిని
దైనందినిగా 'అక్షరసేన ' పేరిట
ముఫ్ఫై సంవత్సరాలుగా సాహిత్య సాంస్కృతిక రంగంలో
కృషి చేస్తున్న
'సాధన సాహితీ స్రవంతి ' సంస్థ
శ్రీ.సాధన నరసింహాచార్యులు
నిన్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని
శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం లో ఆవిష్కరింప చేశారు.
కృష్ణాపత్రిక సంపాదకులు
శ్రీ పిరాట్ల వెంకటేశ్వరులు గారి అధ్యక్షతన జరిగిన
ఈ సభలో
డాక్టర్.కె.వి.రమణాచారి ( ఐ.ఏ.ఎస్.)
దైనందినిని ఆవిష్కరించారు.
ఈ డైరీ రూపొందించిన సంపాదక వర్గంలో
నేనూ,డాక్టర్.ద్వా.నా.శాస్త్రి వున్నాం.
అందువల్ల మేమూ వేదిక ఎక్కాము.
డాక్టర్.వెలుదండ నిత్యానందరావ్ ఆత్మీయ అతిథి గా పాల్గొన్నారు.
ఈ 'అక్షరసేన ' డైరీ కి ముఖ చిత్రం నేనే సంతరించాను.
ఒక ముందుమాట కూడా నాచేత 'సాధన 'రాయించారు.
ప్రతి రోజూ క్లుప్తంగా తోచింది రాసుకోవడానికే కాక సాహితీపరులు,సాహిత్యాభిలాషులూ తాము ఏ రోజు ఏ సమావేశంలో ఎక్కడ పాల్గొనేదీ నమోదు చేసుకునే సదుపాయం వుంది.
డైరీ లో ఒకపేజీ
అంతేకాదు నెలవారీగా ప్రముఖ సాహితీవేత్తల జన్మదినాలు,వర్ధంతులు డాక్టర్.ద్వా.నా.శాస్త్రి సేకరించి ఇందులో కూర్చారు.అందువల్ల ఆ ప్రముఖులను స్మరించుకునే అవకాశం వుంటుంది.
నెలనెలా తాము చదివిన,చదవదలుచుకున్న
పుస్తకాలు నోట్ చేసుకోవడం,తమకు నచ్చిన కార్యక్రమాలు,నచ్చని అంశాలు రాసి పెట్టుకోవడానికి చివర ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి.
వదాన్యులు శ్రీ అశ్విని సుబ్బారావు గారు ఈ దైనందిని వెలుగు చూసేందుకు తోడ్పాటునందించారని సాధన నరసింహాచార్య తెలిపాడు.
నిజంగా ఇలాంటి డైరీ తెలుగు భాషా ,సాహిత్యాభిమానులు సమాదరించదగింది.మరింత సమగ్రంగా, పరిపుష్టం గా మున్ముందు దీనిని ఏటేటా రూపొందించి అందించగల వీలుంది.
బాలబాలికల్లో పద్యరచన పట్ల అభిరుచి కలిగించేందుకు శిక్షణా శిబిరాలు నిర్వహించి పిల్లలు రాసిన ఆటవెలదులను వారిచేతే సమావేశంలో బాల కవిసమ్మేళనంగా ఏర్పాటుచేసి ఆ పిల్లలకు పండిత ఉత్తరీయాలను,అక్షరసేన దైనందిని లను ఇచ్చి సత్కరించడం ఒక అభినందనీయ అంశం.
'సాధన సాహితీ స్రవంతీ 'మూడుపదుల సాహితీ ఉత్సవాలు ఈ ఏడాది పొడుగునా విజయవంతoగా జరగాలని శుభాకాంక్షలందిద్దాం.
నేటి ఆంధ్రప్రభ దినపత్రికలో సమావేశం వార్త.

మీ కృషి అభినందనీయం.. పుస్తకాలు చదవడంలోని ఆనందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే కాకుండా అందరూ ఆ మంచి అలవాటు చేసుకోవాలనే తపనతో దానికైన అనువైన మార్గంగా ఆకర్షణియమైన పద్ధతిలో దైనందిని రూపొందించడం.. నిజంగా మెచ్చదగినది.. ఈ ప్రయత్నాన్ని సాకారంచేసిన మహనీయులందరికీ నా అభినందనలు.. అభివందనాలు...
ReplyDelete