ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Showing posts with label పీఠికలూ -ముందుమాటలూ. Show all posts
Showing posts with label పీఠికలూ -ముందుమాటలూ. Show all posts

Thursday, 30 June 2016

దుగ్గిరాల ' రెక్కల రవళి '






శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావ్ గారు 


నాటకరంగం లో అసమాన ప్రతిభా సంపన్నులు. 

నటుడిగా, దర్శకునిగా 

68 వసంతాలుగా సేవ చేస్తూ 

అనేకరంగస్థలపురస్కారాలు,సన్మానాలుఅందుకున్న 

దుగ్గిరాల వారు 

సాహిత్యాసక్తి తో 

1998 నుండి సుమారు 11 కావ్యాలు ప్రచురించారు.



చక్కని పద్యకృతులు వెలయించిన ఆయన 

రెండు నానీలు సంపుటాలు ప్రచురించారు. 

ఆపై ఆయన సుగమ్ బాబు సృజించిన

'రెక్కలు ' ప్రక్రియ పట్ల ఆకర్షితులై 

2015 లో 


 ని వెలువరిస్తూ 

నన్ను  ఓ ముందుమాట రాయమని కోరారు.



వారి సౌహార్ద్రతతో రాసిన 

అనుభూతి రెక్క విచ్చిన హాయి ఇది.









Saturday, 1 February 2014

కవిగా మా(నస) రఘుశ్రీ




ఉమ్మడిసింగు రాఘవరావ్ 
అంటే తెలియక పోవచ్చు గానీ
హైదరాబాద్ లో
రఘుశ్రీ 
అంటే సాహితీ ప్రియులందరికీ తెలుసు.

మానస సంస్థ పక్షాన
అనేక సాహిత్య కార్యక్రమాల నిర్వాహకునిగా 
తనకు మంచి పేరుంది.
ఆబాల్య మిత్రుడైన తను మంచి కవితారచనాభిలాషి కూడాను.

గతంలో ఉస్మానియా విశ్వ విద్యాలయ విద్యార్థి రచయితల సంఘం కు 
మేం కలసి పనిచేసాం కూడాను.

ఇటీవల తను 50 హైకూలు,50 రెక్కలు రాసి 
అర్థార్థ చంద్రికలు పేర ప్రచురించి ఆవిష్కరింప చేసాడు. 
ఆ సభకు నేనే అధ్యక్షత వహించాను.
ప్రముఖ కవి,విమర్శకుడు డా.అద్దేపల్లి రామమోహన రావ్  ఆవిష్కరించారు.
రఘుశ్రీ కవితా సంపుటికి 
ఆత్మీయ మిత్రునిగా 
నేను రాసిన ముందుమాట ఇది.




Saturday, 27 October 2012

'మందార మకరందాలు '

 
 
 
పోతన భాగవతం నుండి
ఎంపికచేసిన 52 పద్యాలకు
డాక్టర్.సి.నారాయణరెడ్డి గారి రసమంచిత వ్యాఖానంతో
యువభారతి  1973 అక్టోబర్ లో ప్రచురించిన
'మందార మకరందాలు '
నలభైవేల కాపీలు చెలామణి అయ్యి
 
నాలుగవ ముద్రణగా ఇప్పుడు
యువభారతి స్వర్ణోత్సవ సందర్భంగా
26 అక్టోబర్ '2012 న
హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరిగిన సభలో
ఆవిష్కృతమయ్యింది.
సభకు హాజరైన ప్రేక్షకులందరికీ
ఉచిత కానుకగా ఇవ్వడం జరిగింది.

యువభారతి ప్రధాన సంపాదకునిగా
నాలుగవ ముద్రణకు
నేను రాసిన నాలుగు మాటలివి

Tuesday, 16 October 2012

'ప్రజాసూక్తం ' సంపాదకీయ పలుకు

'ప్రజాసూక్తం ' పేరిట 1973 లో
యువభారతి
తెలుగు సామె
తల సంకలనాన్ని
వెలువరించింది.
అది యువభారతి 19 వ ప్రచురణ.

కేవలం రెండు రూఫాయలకే
ఆరోజుల్లో సాహితీప్రియులను చేరింది.
ప్రచురించిన 23 రోజుల్లోనే వేసిన 3,200 కాపీలూ అయిపోయి
వెంటనే మళ్ళీ 5,200 కాపీలు ముద్రించడం జరిగింది.

ఈ ఏడాది మే లో అయిదవ ముద్రణ
మా యువభారతి జీవిత సభ్యులు
శ్రీ పత్రి అశ్వినీకుమార్ సౌజన్యంతో వెలువరించడం జరిగింది.

ప్రస్తుతం యువభారతి ప్రధాన సంపాదకుని గా
నేను ప్రజాసూక్తానికి రాసిన
సంపాదకీయ పలుకులివి.

 
 

Monday, 13 August 2012

'మధ్య'మా'గతి' లో విహారి కవిత్వం







ప్రముఖ కవి,కథకులు,సాహితీ విమర్శకులు
'విహారి '(శ్రీ జే.యస్.మూర్తి)గారి
కొత్త కవితా సంకలనం
'మధ్య(మా)గతి '
ఇటీవలే విడుదలైంది.


నా పై గల ఆదరాభిమానాలతో
తమ కవితా సంకలనానికి
నన్ను ముందుమాట రాయమని
విహారి కోరారు.

2007 తరువాత వారు రాసిన కవితలు,
వివిధ పత్రికలలో ప్రచురితమైనవి
ఇందులో వున్నాయి.


నేను రాసిన ముందుమాట
మీ ముందు పెడుతున్నాను



ఈ కవితా సంపుటి గురించి,
విహారి ఇతర కథా సంకలనాలు,
సాహితీ విమర్శ,పదచిత్ర రామాయణం సంపుటాలు
కావలసిన వారు
ఈ చిరునామాకు రాయవచ్చు.

విహారి,
ఇంటి.నెం.16-11-310/12 ఎ/1/1 ,
గణపతి టెంపుల్ స్ట్రీట్,సలీంనగర్-2,
మలక్ పేట్,హైదరాబాద్.500036
40-24552117 98480 25600


Friday, 10 August 2012

సుభాషితాల సంకలనం 'భావన ' నాలుగవ ముద్రణ








మా యువభారతి పూర్వ అధ్యక్షులు కీ.శే.ఇరివెంటి కృష్ణమూర్తి గారి జయంతి కృష్ణాష్టమి రోజే.గత కొన్ని సంవత్సరాలుగా ఆయనపేరున ప్రముఖులకు స్మారక పురస్కారం ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్రభాషానిలయం లో  ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ పూర్వ అధిపతి డాక్టర్ శ్రీమతి.సుమతీ నరేంద్ర గారికి ఈ ఏటి ఆ పురస్కారం దాక్టర్.సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆచార్య ఎస్.వి.రామారావ్ గారికి సంస్థ ప్రస్తుత గౌరవ అధ్యక్షులు దాక్టర్.తిరుమల శ్రీనివాసాచార్య గారి పేరిటి అవార్డ్ బహూకరించారు.ఈ సందర్భంగా గతంలో యువభారతి ప్రచురించిన ఇరివెంటి వారు సంకలించిన సుభాషితాల సంకలనం 'భావన ' నాలుగవ ముద్రణ ఆవిష్కరించడం జరిగింది. యువభారతి ప్రస్తుత ప్రధాన సంపాదకునిగా నేను ఈ పునర్ముద్రణ కు రాసిన ముందుమాట మీ ముందు వుంచుతున్నాను. 


పై ఇమేజ్ మీద క్లిక్ చేస్తే పెద్ద సైజ్ లో చదవవచ్చు 

Monday, 2 July 2012

భోగినీలాస్యం










కీ.శే.వానమామలై వరదాచార్యులు




















అభినవ పోతన వానమామలై వరదాచార్యులవారి
శతజయంతి సంవత్సరం ఇది.


వారు పోతనచరిత్రం మహాకావ్యం రాసారు.


అందులోని భోగినీలాస్యం ఘట్టానికి వారే రాసిన వ్యాఖానంతో
గతంలో యువభారతి పుస్తకం ప్రచురించింది.


1974 లోనాటిఆ పుస్తకం
తిరిగి వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా
పునర్ముద్రణచేయడంఇటీవలే జరిగింది.


యువభారతి ప్రచురణల ప్రధాన సంపాదకునిగా
నేను ఈ పునర్ముద్రణ కు
సంతరించిన పీఠిక ఇది.




1974 లో వానమామలై వరదాచార్యులుగారిని
యువభారతి లహరిసమావేశాలలో
నేను శాలువాతో సత్కరిస్తున్నప్పటి చిత్రం.

Thursday, 12 January 2012

'అక్షరసేన ' దైనందిని




సాహిత్యాభిమానులకు ఉపయుక్తమయ్యే డైరీ ఒకదానిని
దైనందినిగా 'అక్షరసేన ' పేరిట
ముఫ్ఫై సంవత్సరాలుగా సాహిత్య సాంస్కృతిక రంగంలో
కృషి చేస్తున్న
'సాధన సాహితీ స్రవంతి ' సంస్థ 
శ్రీ.సాధన నరసింహాచార్యులు
నిన్న హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని
శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాషానిలయం లో ఆవిష్కరింప చేశారు.


కృష్ణాపత్రిక సంపాదకులు
శ్రీ పిరాట్ల వెంకటేశ్వరులు గారి అధ్యక్షతన జరిగిన
ఈ సభలో
డాక్టర్.కె.వి.రమణాచారి ( ఐ.ఏ.ఎస్.)
దైనందినిని ఆవిష్కరించారు.

ఈ డైరీ రూపొందించిన సంపాదక వర్గంలో
నేనూ,డాక్టర్.ద్వా.నా.శాస్త్రి వున్నాం.
అందువల్ల మేమూ వేదిక ఎక్కాము.
డాక్టర్.వెలుదండ నిత్యానందరావ్ ఆత్మీయ అతిథి గా పాల్గొన్నారు.


ఈ 'అక్షరసేన ' డైరీ కి ముఖ చిత్రం నేనే సంతరించాను.




ఒక ముందుమాట కూడా నాచేత 'సాధన 'రాయించారు.






ప్రతి రోజూ క్లుప్తంగా తోచింది రాసుకోవడానికే కాక సాహితీపరులు,సాహిత్యాభిలాషులూ తాము ఏ రోజు ఏ సమావేశంలో ఎక్కడ పాల్గొనేదీ నమోదు చేసుకునే సదుపాయం వుంది.

డైరీ లో ఒకపేజీ



అంతేకాదు నెలవారీగా ప్రముఖ సాహితీవేత్తల జన్మదినాలు,వర్ధంతులు డాక్టర్.ద్వా.నా.శాస్త్రి సేకరించి ఇందులో కూర్చారు.అందువల్ల ఆ ప్రముఖులను స్మరించుకునే అవకాశం వుంటుంది.


నెలనెలా తాము చదివిన,చదవదలుచుకున్న
పుస్తకాలు నోట్ చేసుకోవడం,తమకు నచ్చిన కార్యక్రమాలు,నచ్చని అంశాలు రాసి పెట్టుకోవడానికి చివర ప్రత్యేకమైన పేజీలు ఉన్నాయి.




వదాన్యులు శ్రీ అశ్విని సుబ్బారావు గారు ఈ దైనందిని వెలుగు చూసేందుకు తోడ్పాటునందించారని సాధన నరసింహాచార్య తెలిపాడు.


నిజంగా ఇలాంటి డైరీ తెలుగు భాషా ,సాహిత్యాభిమానులు సమాదరించదగింది.మరింత సమగ్రంగా, పరిపుష్టం గా మున్ముందు దీనిని ఏటేటా రూపొందించి అందించగల వీలుంది.


బాలబాలికల్లో పద్యరచన పట్ల అభిరుచి కలిగించేందుకు శిక్షణా శిబిరాలు నిర్వహించి పిల్లలు రాసిన ఆటవెలదులను వారిచేతే సమావేశంలో బాల కవిసమ్మేళనంగా ఏర్పాటుచేసి ఆ పిల్లలకు పండిత ఉత్తరీయాలను,అక్షరసేన దైనందిని లను ఇచ్చి సత్కరించడం ఒక అభినందనీయ అంశం.

'సాధన సాహితీ స్రవంతీ 'మూడుపదుల సాహితీ ఉత్సవాలు ఈ ఏడాది పొడుగునా విజయవంతoగా జరగాలని శుభాకాంక్షలందిద్దాం.

నేటి ఆంధ్రప్రభ దినపత్రికలో సమావేశం వార్త.









Sunday, 25 September 2011

'ఉపనిషత్ సుధాలహరి '




2010 లో ' వేద విజ్ఞాన లహరి ' ప్రచురించిన
యువభారతి

ఉపనిషత్ ల పై
2010 అక్టోబర్ లో ప్రసంగ పరంపరనేర్పాటు చేసి

ఏప్రెల్ '2011 లో
'ఉపనిషత్ సుధాలహరి ' పేరిట
ఆ దశ ఉపనిషత్ ల వ్యాసాలనూ
పుస్తకంగా ప్రచురించింది.



యువభారతి ప్రధాన సంపాదకునిగా
ఆ గ్రంధానికి
నేను రాసిన
ముందుమాట ఇది.










పుస్తకం వెల, ప్రతులు లభించు చోటు వివరాలు ఈ కింద పేజ్ లో వున్నాయి.



(ప్రతి పేజ్ ఇమేజ్ లపై డబుల్ క్లిక్ చేసి పెద్ద సైజ్ లో చదవవచ్చు)