ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Thursday 5 April 2012

శంకర్ గారు వేసిన నా బొమ్మ





శ్రీ సత్తిరాజు శంకర నారాయణ

ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా!

ప్రముఖ చిత్రకారులు బాపు గారి అసలు పేరు అనుకుంటున్నారా!.
కాదండి బాబూ!
బాపు గారి అసలు పేరు శ్రీ సత్తిరాజు లక్ష్మీ నారాయణ.

మరి ఈ శంకరనారాయణ ఎవరంటే ,స్వయానా బాపు గారి తమ్ములే!



శంకర నారాయణ గారు కూడా స్వయంగా చిత్రకారులు.
పెన్సిల్ తోనూ,చారోకోల్ తోనూ అనేకమంది ప్రముఖుల క్యారికేచర్ లు చిత్రించారు.దాదాపు 1500 కు పైగా అటువంటి అద్భుతమైన బొమ్మలు వేసి ఆయన ఇటీవలే ఇండీయన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందారుకూడాను.


1936 లో జన్మించిన శంకరనారాయణ గారు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో స్టేషన్ డైరక్టర్ గా ఉన్నత పదవిలో పనిచేసి ,1995 లో రిటైర్ అయ్యారు.


అప్పటినుంచీ ఇంకా బోలెడు బొమ్మలు వేస్తున్నారు.
మైసూర్ లోనూ,హైదరాబాద్ లోనూ కూడా తమ బొమ్మల ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రశంసలందుకున్నారు.




ఇవాళ (5.4.2012)  పొద్దున్న నా సెల్ మ్రోగింది.
స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఎవరిదో తెలియదు.
ఫోన్ ఆన్సర్ చేయడానికి ఎత్తుదునుకదా.. 'నేను శంకర్ నండీ " అంటూ ఆయనదే గొంతు.


ముళ్ళపూడి వారి అబ్బాయి వర ముళ్ళపూడి.
వాళ్ళింటి నుండి మాట్లాడుతూ శంకర్ గారు'మా అల్లుడి ఇంటినుండి మాట్లాడుతున్నాను 'అంటూ మాట్లాడారు.



ఇంతకీ నేను ఆనందంతో పొంగిపోయే విషయం నా క్యారికేచర్ వేశానని, నా ఈ మెయిల్ అడ్రస్ అడిగి ,దానికి వెంటనే పంపించారు.


ఆహా ! ఏమి నా భాగ్యం అనుకున్నాను. నా క్యారికేచర్ వేయాలని ఆయనకు ఎందుకు అనిపించిందో! అది కేవలం నా అదృష్టం అంతే!.




ఆయన వేసిన నా క్యారికేచర్ ఇది





ఆయనకు నా కృతజ్ఞతలు ప్రకటించడం తప్ప
ఆయన సహృదయతకూ,ఔదార్యానికీ నేనేమివ్వగలవాడిని.



శ్రీ శంకరనారాయణ గారు సదా ఆయురారోగ్య ఐశ్వర్యాలతొ విరాజిల్లాలని మనసా ఆకాంక్ష.

-సుధామ

5 comments:

  1. చాలా బాగుంది!

    ReplyDelete
  2. మీరు నిజంగా అదృష్టవంతులు

    ReplyDelete
  3. మీకు కలిగిన అదృష్టానికి అభినందనలు. బొమ్మ చాలా బాగుంది..

    ReplyDelete
  4. మీ సంతోషాన్ని ఇలా పదిమందితో పంచుకోవడం చాలా బాగుంది.. మీ కారికేచరు చాలా బాగా గీసిన శ్రీ శంకర్ గార్కి... వారి అభిమానం చూరగొన్న మీకు అభినందనలు..

    ReplyDelete