ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Monday 11 July 2011

రేడియో హీరోయిన్ శ్రీమతి.శారదా శ్రీనివాసన్



రేడియో హీరోయిన్
శ్రీమతి.శారదా శ్రీనివాసన్



రేడియో హీరోయిన్ అంటే
ఎవరికైనా గుర్తుకొచ్చేది శ్రీమతి.శారదా శ్రీనివాసన్ గారే.

ఆకాశవాణి చేసుకున్న పుణ్యఫలం ఆవిడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నాటకవిభాగం
వైభవప్రాభవలతో వెలుగొందిన ఆ రోజుల్లో
శ్రీ.నండూరి విఠల్, ఆవిడ, రేడియో హీరోహీరోయిన్లుగా
అసంఖ్యాక శ్రోతల హృదయాలలో స్థిరవాసం ఏర్పరచుకున్నారు.
అలాగే కె.చిరంజీవి గారితో శారదగారి నాటకాలు కూడాను.













శ్రీ.నండూరి విఠల్


                                                                                     







                                                                                       కె.చిరంజీవి









శారదగారి కంఠం అంటే చిన్నప్పటినుండీ నాకు చాలా ఇష్టం.


అలాంటిది రేడియోలో నేను ఉద్యోగం చేస్తానని గాని,
ఆవిడ అభిమానాన్ని చూరగొంటాననిగాని,
ఆవిడతొ నాటకాలలో నటించే అవకాశం వస్తుందని గాని
ఎలా వూహించగలను.
కానీ అదే జరిగింది
..'మత్పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో..'గానీ.

కౌముది నెట్ మాసపత్రికలో
నా రేడియో జ్ఞాపకాలు రాస్తున్నాను.
అందులో ఆ జ్ఞాపకాలన్నీ ఎలాగూ తలుచుకుం(టూం)టానుగానీ,
నేను కౌముదిలో,
శ్రీ డి.వెంకట్రామయ్య గారు 'రచన' మాసపత్రికలో
మా రాతలు రాస్తూండగానే

నిశ్శబ్ద విప్లవం లా
శ్రీమతి.శారదా శ్రీనివాసన్ గారు
తమ 'నా రేడియో అనుభవాలు,జ్ఞాపకాలు '
అనే అద్భుత రచనను
పుస్తకంగా తెచ్చి
అందరికీ ఆశ్చర్యానందాలను కలిగించారు.




నిన్న 10 జూలై 2011 న
హైదరాబాద్ చిక్కడపల్లి లోని నగరకేంద్ర గ్రంథాలయంలో
డాక్టర్.చాట్ల శ్రీరాములు గారు ముఖ్య అతిథిగా .
శ్రీ.ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి అధ్యక్షతన,
డాక్టర్.వాడ్రేవు చిన వీరభద్రుడుతన అద్భుత విశ్లేషణా ప్రసంగంతో విశిష్ట అతిధిగా,
డాక్టర్.కె.బి.లక్ష్మి ఆత్మీయ అతిథిగా
క్రిక్కిరిసిన ప్రేక్షకులతో జరిగిన సభ
ఒక మరపురాని తలుచుకునే తరుణం.


తమ ఎదిగీఎదగని కుమార్తె  అమాయిక  చి.సౌ.నీరదకు
ఆ గ్రంథాన్ని ఆవిడ అంకితం చేసారు.


ఆవిష్కరణ జరిగిన 10 జూలై
ప్రముఖ వేణుగాన సంగీత విద్వాంసులు,
రేడియోలో సంగీత విభాగం ప్రొడ్యూసర్ అయిన
హాస్యచతుర విశిష్ట వ్యక్తి కీ.శే.శ్రీనివాసన్ గారితో
శారదగారి వివాహం జరిగిన రోజు కావడం ఒక విశేషం.



శారద గారి పుస్తకంలో
నాకూ ఒక పేజీ లభించడం ,
నా గురించీ ఆవిడ రాయడం
ఎంతో ఆనందం కలిగించిన విషయం.



శారదగారు
తన మనసుకు హత్తుకుపోయిన కార్యక్రమాలలో
నేను రాసిన ఉదయతరంగిణి ని కూడా
జ్ఞాపకం చేసుకోవడం
నాకు పరమానందం.



మనసు కవి ఆత్రేయ మాటలలో శారద





















పుస్తకం మీరెలాగూ చదువుతారు గానీ
ఈ లోగా నా ఆనందాన్ని ప్రకటించుకోవడానికే
ఈ నాలుగు మాటలూ..

పుస్తకం వెల కేవలం 125 రూపాయిలు.


శారద గారి చిరునామా:
శ్రీమతి.శారదా శ్రీనివాసన్ ,
204,సీతారామ ఎంక్లేవ్,
స్ట్రీట్ నం.10,హిమాయత్ నగర్,
హైదరాబాద్.29.



ఈ పుస్తకం చదవడం ఒక అనుభవం .వదులుకోకండేం!
ఈ పుస్తకం పై 2011 సెప్టెంబర్ 4 ఆదివారం ఉదయం 11.30 కు టి.వి.9 లో బుక్ పాయింట్ కార్యక్రమంలో సుధామ,కె.బి.లక్ష్మి పాల్గొన్నారు.ఆ వీడీయో రెందు భాగాలుగా కింద లింకులలో చూడవచ్చు
http://youtu.be/cPpo_fIJRPk
http://youtu.be/beOJsqjfAEU

13 comments:

  1. మంచి అనుభూతుల్ని మాకు కూడా పంచినందుకు ధన్యవాదాలు సుధామ గారూ !

    ReplyDelete
  2. అద్బుతమైన జ్నాపకాలు.. అవిడగారి గళం నాకింకా గుర్తే !! ఎన్నో మంచి కార్యక్రమాలు , నాటికలు చేశారు... మళ్ళీ అవన్నీ గుర్తు చేసి నందుకు ధన్యవాదాలు.అవిడ జీవించిన కొన్ని నాటకాలు ఇప్పటికీ నాదగ్గర mp3 format లో ఉన్నాయి.. మళ్ళీ అవి ఒకసారి వింటా ! ఈ శుభ సందర్భంగా !!

    ReplyDelete
  3. సుధామ గారూ! ఈ పుస్తకావిష్కరణకు ఎక్కువ సంఖ్యలో రేడియో అభిమానులూ, పాఠకాభిమానులూ హాజరవ్వటం సంతోషకరం! ఈ కార్యక్రమం వివరాలనూ, పుస్తకంలోని విశేషాలనూ మీరు వెంటనే పంచుకోవటం బాగుంది.

    ReplyDelete
  4. పుస్తకావిష్కరణ సభకు ఇంతమంది జనం వచ్చారంటే రేడియో మీద ఇంకా అభిమానులకు ప్రేమ సజీవంగా ఉన్నట్టే! శారద గారి మెస్మరైజింగ్ వాయిస్ మహిమ కూడాను!

    పుస్తకం తప్పక చదవాలి!సభ విశేషాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు!

    ReplyDelete
  5. వావ్. శారదా శ్రీనివాసన్ గారే!
    కళ్ళు మూసుకొని ఓ సారి పురూరవ వింటే, ఆ "గొంతు" సుందరి తోనే ఉండిపోవాలనిపిస్తుంది జీవితాంతం:-). అవునూ, నాదో తుంటరి ప్రశ్న, ఇలాంటి దేవకన్యల గొంతున్న వాళ్ళ భర్తలకి వీళ్ళు మాట్లాడినప్పుడు "పెళ్ళాం" గొంతు వినిపిస్తుందా, లేక మనకనిపించినట్లుగా వేరే లోకం నుంచి అమృతం హృదయం లోకి జారుతున్నట్లుంటుందా?

    ReplyDelete
  6. ippudu enni powerful media vachinaa aanaati radio
    andulo Sharada srinivas gari galam aa nati taraala vallu evvaru marchiporu.

    vasantha mukthavaram
    chicago.

    ReplyDelete
  7. సుధామ గారు! ఈ పుస్తక వివరాలు తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. ఈ మధ్యనే శ్రీమతి శారద శ్రీనివాసన్ గారిని ముఖత కలుసుకో గలగడం నా అదృష్టం గా భావిస్తున్నా.మరపురాని, మరువలేని మధుర గళం ఆవిడది. తప్పక ఈ పుస్తకం చదువుతాము.మీ రేడియో అనుభవాలు కూడా చాల అద్భుతం గా ఉన్నాయి కౌముది లో.

    ReplyDelete
  8. శ్రీనివాసన్ గారు వేణుగాన విద్వాంసులు. మీ టపాలో వాయులీన విద్వాంసులు అని వచ్చిందండీ.

    శారదా శ్రీనివాసన్ గారు రాసిన ఈ పుస్తకావిష్కరణ వారి 50వ పెళ్ళిరోజునే జరిగిందని (పుస్తకంలో సోర్సును బట్టి) ఆలస్యంగా గ్రహించాను!:)

    ReplyDelete
  9. సుధామ గారూ!పాత జ్ఞాపకాలను నెమరి వేయించారు.నా ధన్యవాదాలు.ఈ మధ్యనే భండారు శ్రీనివాస రావు గారితో కూడా మాట కలిపాను.వారికి కూడా ధన్యవాదాలు.

    ReplyDelete
  10. Enta baaga chepparu. ventane velli moodu pustakaalu kontalu...okati naku, rendodi maa nanna gariki, mododi maa pedanannagaru sri dittakavi venkateswara Rao gariki. Varu tyagaraya ganasabha adhyakhuluga unna rojullo chala karyakramalu jarigayata. monnane telisindi. dhanya vaadalu.telugulo type chetunte akkadakkada tappulu dorlutunnayi anduke Tinglish. mannichanden.....

    ReplyDelete