ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Tuesday, 10 September 2013

'హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్ '






సాహిత్యాభివృద్ధికొరకు 
హైదరాబాద్ లో 1940 లో 
అంటే నిజాం పాలనా ప్రాంతం  గా వున్న కాలంలోనే 
ఏర్పరచబడిన సంస్ఠకు పెట్టిన పేరు
'హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్ '.
ఆంధ్ర అనేది తెలుగు భాషకు  పర్యాయంగా వాడడం  
నాడు తెలంగాణలోనే ఎక్కువ పరిపాటి.
ఆ పరిషత్ కి మొహమ్మద్ ఖాసింఖాన్ కార్యదర్శి.
హైదరాబాద్ తెలుగు అకాడమీ గా వ్యవహృతమవుతూ 
మూడు నెలలకు ఒకసారి
'హైదరాబాద్ ఆంధ్ర సాహిత్య పరిషత్  'పత్రిక వెలువడేది.
హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ పత్రిక తొలిసంచికలో 
సంపాదకుల  'స్వవిషయం '
ఆంధ్రభాషాభి వృద్ధికై 
నిజాం హైదరాబాద్ లో జరిగిన కృషిని తెలుపుతుంది.  




1 comment:

  1. అక్షరగురువు సుధామగారికి నమస్కారం .... మీ ఏకలవ్య శిషురాలు.

    ReplyDelete